నల్లగొండ : వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పిందుకు నల్లగొండకు రావద్దని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ఉంటుందని పేర్కొన్నారు.
సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి
● మున్సిపల్ ప్రత్యేక అధికారి శ్రీనివాస్
నల్లగొండ టూటౌన్ : వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం నీలగిరి మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లు మున్సిపల్ కమిషనర్ ఇతర ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి బాధ్యతగా పనిచేస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. వేసవిలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీ ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, ఆస్తి పన్ను, నల్లా బిల్లులు వసూలు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఈఈ రాములు, ఇతర విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment