ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
కేతేపల్లి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కేతేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందులు, ఇతర వైద్య పరికరాలు, రోగులకు అందుతున్న వైద్య సేదలపై డాక్టర్ అర్చనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేతేపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ తన వెంట తెచ్చిన చాక్లెట్లను చిన్నారులకు పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడే విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం చెర్కుపల్లిలోని కేజీబీవీని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట కేతేపల్లి తహసీల్దార్ ఎన్.మధుసూధన్‌రెడ్డి, ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, పీహెచ్‌సీ వైద్యాధికారి దివ్య, కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ వసంత తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment