పదోన్నతితో బాధ్యత పెరుగుతుంది
నల్లగొండ : పదోన్నతి పొందిన వారికి పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమశిక్షణతో, బాధ్యతగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పేర్కొన్నారు. శుక్రవారం 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి స్టార్ బ్యాడ్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో మమేకమవుతూ స్టేషన్‌కు వచ్చే వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
Comments
Please login to add a commentAdd a comment