విద్యతోనే సమగ్రాభివృద్ధి
రామగిరి(నల్లగొండ) : విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడారు. ముందుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వళన, కేక్‌కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యనందిస్తూ ఎంతో మంది విద్యార్థుల పురోగతికి సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల దోహదపడుతోందన్నారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన వారు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. పాఠశాలలో నిర్మిస్తున్న ఆడిటోరియానికి కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షల విరాళం అందిస్తానని హామీ ఇచ్చారు. నిరాదరణకు గురైన బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ విలువలతో కూడి విద్యను భోదించి సమాజంలో నిలదొక్కుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలమన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థిగా విద్యతో పాటు సమాజసేవను అలవర్చుకున్నానని అందుకే రాజకీయంగా ఉన్నతంగా ఎదగగలిగానని అన్నారు. ఈ సందర్భంఆ విద్యార్థుల స్కాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వేడుకల అధ్యక్షుడు జేకె గార్వోసిస్, రెరా చైర్మన్ రిటైర్డ్ జడ్జి రాజశేఖర్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ హృదయ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, పూర్వ విద్యార్థులు ఏచూరి భాస్కర్, నరేంద్రబాబు, పాశం సంపత్‌రెడ్డి, పాదూరి అమరేందర్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, మాజీ కౌన్సిరల్ జూలకంటి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment