నల్లగొండ : గురుకులాల్లో కొందరు విద్యార్థులు బుద్ది హీనంగా మారుతోంది. చదువు చెప్పే గురువుల గురించి గోడలపై అశ్లీల రాతలు రాస్తూ వారిని అవమానిస్తున్న సంఘటన నల్లగొండలోని ఓ గురుకులంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో గురువులు ఆ విద్యార్థులను మందలించడంతో వారు గురువులపైనే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విద్యార్థులకు సంబంధించిన వారు వచ్చి గురువులను ప్రశ్నించగా.. గోడలపై ఉన్న రాతలను చూపించడంతో వారు కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. మళ్లీ ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ సంఘటనను కొందరు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా సదరు విద్యార్థులకు తల్లిదండ్రులు బుద్ది చెప్పాలని సూచించినట్లు తెలిసింది.
గురువులపైనే కొందరు అశ్లీల రాతలు
మందలించిన వారిపైన తిరిగి ఫిర్యాదు
నల్లగొండలోని ఓ గురుకులంలో
వెలుగుచూసిన ఘటన
Comments
Please login to add a commentAdd a comment