![20 రోజుల్లోనే 47 అడుగులు తగ్గిన నీటిమట్టం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10hla102-230083_mr-1739217855-0.jpg.webp?itok=0_VScV-N)
20 రోజుల్లోనే 47 అడుగులు తగ్గిన నీటిమట్టం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి స్పిల్‌వే(546అడుగులు) దిగువకు 543.80 అడుగులకు పడిపోయింది. ఈ ఏడాది కృష్ణా పరీవాహక ప్రాంతంతో పాటు, స్థానికంగా అత్యధికంగా వర్షాలు కురిశాయి. కృష్ణానదిలో అక్టోబర్ మాసాంతం వరకు ఎగువ నుంచి వరదలు కొనసాగాయి. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. గత ఏడాది అక్టోబర్ వరకు జలాశయం నీటిమట్టం 589.70 అడుగులు ఉండగా 311.1486 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. అయితే, వానాకాలంలో వేసిన వరిపంట డిసెంబర్ చివరికి చేతికి వచ్చింది. వరికోతలు మొదలు అయ్యాయి. తిరిగి యాసంగి సీజన్‌కు రైతులు నార్లు పోసుకుంటారని ఏకధాటిగా కాల్వలకు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. డిసెంబర్ 15 నుంచి యాసంగి సీజన్ మొదలవుతున్నట్లు సాగునీటి శాఖ అధికారులు ప్రకటించారు. అప్పుడు సాగర్ జలాశయం నీటిమట్టం 580.90 అడుగుల (285.6098 టీఎంసీలు) నీరుంది. ప్రస్తుతం యాసంగి వరి పొలాలు పొట్టదశలో ఉన్నాయి. ఇప్పటి వరకు సాగు, తాగునీటికి కలిసి సాగర్ నుంచి 89టీఎంసీల నీటిని విడుదల చేశారు. అయితే, యాసంగి పంట నీటి విడుదలకు షెడ్యూల్ ఏప్రిల్ వరకు ఉంది. అప్పటి వరకు కాల్వలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది.
సాగర్ జలాశయం
ఫ నాగార్జునసాగర్‌లో వేగంగా తగ్గిపోతున్న నీరు
ఫ స్పిల్‌వే దిగువకు నీటమట్టం
ఫ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 543 అడుగులు
ఆన్ ఆఫ్ విధానానికి స్వస్తి!
ఎడమ కాల్వలకు ఆన్ ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయనున్నట్లుగా తెలంగాణ సాగునీటిశాఖ అధికారులు ప్రకటించారు. కానీ, రైతుల డిమాండ్ మేరకు కుడి, ఎడమ కాల్వలకు ఏకధాటిగా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment