![విధుల్లో అలసత్వం వహించొద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mlg06-230120_mr-1739217855-0.jpg.webp?itok=PNRMhWjb)
విధుల్లో అలసత్వం వహించొద్దు
మిర్యాలగూడ : వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం రాత్రి ఆమె దామరచర్ల పీహెచ్‌సీని, మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా దామరచర్ల పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న సాధారణ ప్రసవాలు, ఓపీ, ఇన్ పేషెంట్ల వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడంతోపాటు రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆసుపత్రిలో అవసరమైన అన్ని మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్యం అందించాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, తహసీల్దార్ హరిబాబు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
‘బి.వెల్లెంల’ ద్వారా చెరువులు నింపాలి
నార్కట్‌పల్లి : బ్రాహ్మణ వెల్లెంల – ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి వారం రోజుల్లో ఐదు చెరువులను నింపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్, ఎడమ కాల్వ పనులను, పంపుహౌస్, నీటిని ఎత్తిపోసే ప్రక్రియను పరిశీలించారు. ఇటీవల నీటితో నింపిన చౌడంపల్లి చెరువును సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జౌరవాణి, అప్పాజిపేట, దోమలపల్లి, కాకులకొండారం, నర్సింగ్‌బట్ల చెరువులను నింపిన తర్వాత అన్నెపర్తి, బుద్ధారం, చర్లపల్లి, భీమ సముద్రాన్ని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ గంధం శ్రీనివాస్‌రెడ్డి, డీఈ విఠలేశ్వర్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఏఈలు నవీన్, రాజశేఖర్‌రెడ్డి, ఆంజనేయులు, ఆర్‌ఐ తరుణ్ ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ దామరచర్ల పీహెచ్‌సీలో ఇద్దరికి షోకాజ్ నోటీసు
Comments
Please login to add a commentAdd a comment