ముగిసిన మినీ సరస్ ఫెయిర్
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లో గల టీటీడీ కల్యాణ మండపంలో వారం రోజుల నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ అమ్మకాల, ప్రదర్శన (మినీ సరస్ ఫెయిర్) సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చేనేత, మట్టి పాత్రల అమ్మకాలు, 1 గ్రామ్ ఆర్నమెంట్స్‌ను స్టాల్స్ ద్వారా చక్కగా ప్రదర్శించి అమ్మకాలు చేసిన స్వయం సహాయక సంఘాల మహిళలను, సంబంధిత సిబ్బందిని అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఆఫీసు సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment