‘ప్రాదేశిక’ ఓటరు జాబితా విడుదల
నల్లగొండ : మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాను సోమవారం విడుదల చేశారు. ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని.. అందుకు సంబంధించి ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవాలని ఆదేశించడంతో జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో 33 జెడ్పీటీసీ, 352 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారు చేశారు. సోమవారం ఆ జాబితాను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ఉంచారు. ప్రాదేశిక ఓటర్లు జిల్లాలో మొత్తం 10,77,817 వీరిలో పురుషులు 5,33,333 మంది ఉండగా.. మహిళలు 5,44,429 మంది ఇతరులు 55 మంది ఉన్నారు.
మండలాల వారీగా ఎంపీటీసీలు..
అడవిదేవులపల్లి 5, అనుముల 7, చందంపేట 9, చండూరు 8, చింతపల్లి 14, చిట్యాల 12, దామరచర్ల 14, దేవరకొండ 11, గుండ్లపల్లి 13, గుర్రంపోడు 12, కనగల్ 12, కట్టంగూర్ 13, కేతేపల్లి 11, కొండమల్లేపల్లి 9, మాడ్గులపల్లి 10, మర్రిగూడ 10, మిర్యాలగూడ 19, మునుగోడు 13, నకిరేకల్ 9, నల్లగొండ 13, నాంపల్లి 11, నార్కట్‌పల్లి 15, నేరడుగొమ్ము 6, నిడమనూరు 13, పీఏపల్లి 10, పెద్దవూర 11, శాలిగౌరారం 13, తిప్పర్తి 9, తిరుమలగిరి సాగర్ 11, త్రిపురారం 12, వేములపల్లి 7, గట్టుప్పల్ 5, గుడిపల్లి 5 ఎంపీటీసీలు ఉన్నాయి.
ఫ జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన
ఫ జిల్లాలో 352 ఎంపీటీసీ, 33 జెడ్పీటీసీ స్థానాలు
Comments
Please login to add a commentAdd a comment