![ఎనిమిదేళ్లుగా ఎదురుచూపు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/03nlc28-600523copy_mr-1739217856-0.jpg.webp?itok=ny23ZrFW)
ఎనిమిదేళ్లుగా ఎదురుచూపు
నల్లగొండ : ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకున్న రైతులకు ఎనిమిదేళ్లుగా హమాలీ చార్జీలు అందడం లేదు. మొత్తం 14 సీజన్లలో రూ.32.04 కోట్లు ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉంది. ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న సందర్భంలో తూకాలు వేసిన హమాలీలకు రైతులే హమాలీ చార్జీలు చెల్లిస్తారు. ఆ డబ్బును ప్రభుత్వం తిరిగి రైతుల ఖాతాలో జమ చేయాలి. కానీ.. ఆ డబ్బు కోసం రైతులు ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
టన్నుకు రూ.55.2 చొప్పున
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ కమిటీ కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. కేంద్రాల్లో వడ్లు ఆరబోసేందుకు టార్పాలిన్లు రైతులే సమకూర్చుకోవాలి. తూకం వేస్తే రైతులే ఒక మెట్రిక్ టన్నుకు రూ.55.2 చొప్పున హమాలీలకు చెల్లించాలి. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలా 2017–18 వానాకాలం నుంచి 2023–24 యాసంగి వరకు మొత్తం 14 సీజన్లలో ధాన్యం కొనుగోలు చేశారు. ఆయా సీజన్లకు సంబంధించి హమాలీలకు రైతులే డబ్బులు చెల్లించారు. కానీ ప్రభుత్వం ఆ డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. ఆ మొత్తం రూ.32,04,37,841 చెల్లించాల్సి ఉంది.
ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తులు..
రైతులు తాము అమ్ముకున్న ధాన్యానికి సంబంధించి హమాలీలకు చెల్లించిన డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. హమాలీ చార్జీలు తామే చెల్లిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. కానీ ఎనిమిదేళ్ల నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని రైతులు అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం హమాలీ చార్జీలు తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫ రైతులకు అందని హమాలీ చార్జీలు
ఫ రూ.32.04 కోట్లు పెండింగ్
Comments
Please login to add a commentAdd a comment