కర్నూలు(అర్బన్): కర్నూలు – బళ్లారి రోడ్డు (కేబీ రోడ్)లో కి.మీ 4/0 నుంచి 8/4 కి.మీ వరకు రోడ్డు వెడల్పు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తుంగభద్ర పుష్కరాల నిధులు రూ.13.20 కోట్లతో ఈ పనులను చేపడుతున్నారు. కర్నూలు నగరం బళ్లారి చౌరస్తా నుంచి కల్లూరు మండలం పెద్దపాడు వరకు రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ప్రస్తుతం ఉన్న రోడ్డును వెడల్పు చేసి, మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఆర్ నాగరాజు తెలిపారు. పనులు కాగా రోడ్డు వెంట ఉన్న కల్వర్టులను పూర్తి స్థాయి నాణ్యతతో వెడల్పు చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment