పోలీసు ప్రధాన పరీక్షకు 241 మంది అభ్యర్థుల ఎంపిక
కర్నూలు: కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు 246 మంది పురుష అభ్యర్థులు ఎంపికయ్యారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలంలో దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. 6వ రోజు సోమవారం 600 మంది అభ్యర్థులను ఆహ్వానించగా 332 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హాజరయ్యారు. వారి ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్టులు నిర్వహించారు. అనంతరం ఫిజికల్ ఎఫిషీయన్సీ టెస్టులో భాగంగా ముందుగా 1600 మీటర్ల పరుగు నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో ప్రతిభ కనపరచి కానిస్టేబుల్ ప్రధాన పరీక్షకు 241 మంది అర్హత సాధించారు. ఏవైనా సమస్యలు, ఇతర కారణాలతో అప్పీల్ చేసుకున్న అభ్యర్థులు జనవరి 28వ తేదీన హాజరు కావాలని అధికారులు తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఉన్నందున దేహదారుఢ్య పరీక్షలకు విరామం ప్రకటించారు. ఈనెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్నందున జిల్లా నుంచి సిబ్బంది బందోబస్తు విధులకు వెళ్లారు. అలాగే తిరుపతిలో 10వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా బందోబస్తు కోసం కూడా జిల్లా నుంచి సిబ్బంది వెళ్లారు. దీంతో దేహదారుఢ్య పరీక్షల వద్ద బందోబస్తు విధులకు సిబ్బంది కొరత ఏర్పడింది. తిరిగి 16వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు పునఃప్రారంభం కానున్నాయి. హోంగార్డ్స్ సదరన్ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ కార్యాలయం, సాంకేతిక సిబ్బంది ఈ పరీక్షలకు పర్యవేక్షించారు.
15వ తేదీ వరకు దేహదారుఢ్య
పరీక్షలకు విరామం
16న పునఃప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment