ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించండి
నంద్యాల: ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వినతులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తర్వాత వాటిని నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు రీఓపెన్ కావడానికి గల కారణాలకు సంబంధించి దాదాపు పది అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. 24 గంటల లోపల పరిష్కరించాల్సిన మూడు ఫిర్యాదులు, 34 రీఓపెన్ అయిన ఫిర్యాదులు, 20 సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు, ఇంకా బీయాండ్ ఎస్‌ఎల్‌ఏలో ఉన్న అర్జీలపై తక్షణమే స్పందించి క్లియర్ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ బండిఆత్మకూరు, పాములపాడు, జూపాడుబంగ్లా, బనగానపల్లె, సంజామల మండలాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రీ హోల్డ్ భూముల డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని ఆర్డీఓ, తహసీల్దార్లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 170 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి వినతులు ఇచ్చారని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలి
కుష్టు వ్యాధి నిర్ధారణ కోసం ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 2 వరకు ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, వైద్యాధికారులతో కలిసి ఆమె కుష్టు వ్యాధి నిర్మూలన వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధి నిర్ధారణ కోసం చేపట్టే ఇంటింటి సర్వేలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు చురుకుగా పాల్గొని స్వీయ పరీక్షలు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్పర్శ లేని మచ్చలు, రాగి రంగు మచ్చలు, పొడి చర్మంపై బుడిపలు తదితర లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించి వైద్య కేంద్రాలకు తీసుకురావాలన్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ, టీబీ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి, పారామెడికల్ ఆఫీసర్ ఇజాజుల్ హక్ పాల్గొన్నారు.
అధికారులు ప్రతి వినతిని
క్షుణ్ణంగా చదవాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment