కూటమి పాలనపై తిరుగుబాటు...
కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి రాగానే డిమాండ్ల సాధన కోసం ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన, రాజకీయ పార్టీలు దండెత్తాయి. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని వైఎస్‌ఆర్‌సీపీ, ఇసుక రేట్లను తగ్గించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయాలని వాపపక్ష పార్టీలు పెద్ద ఎత్తున్న ఆందోళలు నిర్వహించారు. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు తమకు ఉద్యోగ భద్రతతోపాటు వేతనాలను పెంచాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళనలతో హోరెత్తించారు.
Comments
Please login to add a commentAdd a comment