ఇది అవుకు– కొండమనాయినిపల్లె రోడ్డు మలుపు. ఈ మార్గంలో 13 కి.మీ మేర రహదారిని బాగు చేసేందుకు రూ.10 లక్షల నిధులు వెచ్చించారు. పనులు చేసిన 15 రోజుల వ్యవధిలోనే కంకర పైకితేలి పాత రోడ్డునే తలపిప్తోంది. | - | Sakshi
Sakshi News home page

ఇది అవుకు– కొండమనాయినిపల్లె రోడ్డు మలుపు. ఈ మార్గంలో 13 కి.మీ మేర రహదారిని బాగు చేసేందుకు రూ.10 లక్షల నిధులు వెచ్చించారు. పనులు చేసిన 15 రోజుల వ్యవధిలోనే కంకర పైకితేలి పాత రోడ్డునే తలపిప్తోంది.

Published Thu, Jan 9 2025 2:01 AM | Last Updated on Thu, Jan 9 2025 2:01 AM

ఇది అ

ఇది అవుకు– కొండమనాయినిపల్లె రోడ్డు మలుపు. ఈ మార్గంలో 13

రూ. 30.82 కోట్లు

430 కి.మీ. మేరలో రహదారి

మరమ్మతులకు మంజూరైన నిధులు

129

గతుకులకు ప్యాచింగ్‌ చేసే పనుల సంఖ్య

94 ఇప్పటి వరకు పూర్తి అయిన

ప్యాచింగ్‌ పనుల సంఖ్య

కూటమి ప్రభుత్వం మాయజాలం

ఆర్భాటంగా రహదారుల

మరమ్మతు పనులు

జిల్లాలో గుతుకులకు నాసిరకం

అతుకులు

వేసిన 10–15 రోజులకే

లేచిపోయిన తారు

ప్రజాధనం దుర్వినియోగం

చోద్యం చూస్తున్న అధికారులు

కోవెలకుంట్ల – సంజామల రహదారి ఇది. ఈ మార్గంలో 8.4 కి.మీ పరిధిలో గుంతలు పూడ్చేలా రూ.4.65 లక్షలతో పనులు చేపట్టారు. ఈ పనులు తూతూ మంత్రంగా చేయడంతో కొద్దిరోజులకే రోడ్డుపై ఇలా గుంతలు దర్శనమిస్తున్నాయి.

గోస్పాడు మండలం యాళ్లూరు బైపాస్‌ రోడ్డు ఇది. 650 మీటర్ల మేరకు ఈ రోడ్డుపై గుంతలు ప్యాచింగ్‌ చేసేందుకు రూ.4.40 లక్షలు ఖర్చు చేశారు. మరమ్మతులు చేసిన నెలరోజుల్లోనే కంకర లేచి రోడ్డు పూర్తిగా దెబ్బతినింది. ఈ కొత్త బైపాస్‌ రోడ్డుపై ఇంకా భారీ వాహనాల రాకపోకలు మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గోస్పాడు: కూటమి నాయకులు ఎన్నికల ముందు రోడ్డ నిర్వహణపై నానా హంగామా చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, ఎక్కడా గోతులు లేకుండా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పారు. ఏడునెలలవుతున్నా కొత్త రోడ్ల మాట దేవుడెరుగు, అక్కడక్కడ చేస్తున్న ప్యాచ్‌ వర్క్‌లపై కూడా పర్యవేక్షణ లేదు. దీంతో వారం పది రోజులకే తారు, కంకర వేరై పోయి యథా ప్రకారం గుంతలు దర్శనమిస్తున్నాయి. కేవలం రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు చర్యలు చేపట్టారు కానీ, ఆయా పనులు కూడా పూర్తి నాణ్యతతో చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేట్‌ హైవేస్‌, మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లపై కూడా పనులు అంతంత మాత్రంగానే చేపడుతున్నారు. ఎస్‌హెచ్‌, ఎండీఆర్‌ రోడ్ల పరిస్థితే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌అండ్‌బీ రోడ్లకు కేవలం పైపూతలు పూస్తు మమ అనిపిస్తున్నారు. మిషన్‌ పార్ట్‌ హోల్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా జిల్లాలో 439 కిలోమీటర్ల మేర రూ. 3,082 లక్షలతో 129 పనులు మంజూరయ్యాయి. గత ఏడాది నవంబర్‌ 2వ తేదీన ప్రారంభించిన ఈ పనుల్లో ఇప్పటి వరకు 391 కిలోమీటర్ల మేర ప్యాచ్‌ వర్క్‌లు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో పూర్తిస్ధాయిలో దెబ్బతిన్న రోడ్లను వదిలి నామ్‌కే వాస్తే కొన్ని రోడ్లను మాత్రమే ఎంపిక చేసి మరమ్మతులు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కానరాని నాణ్యత

జిల్లాలోని పలు రోడ్లపై గుంతల పూడ్చివేత పూర్తి నాసిరకంగా చేపట్టడంతో కంకర బయట పడి ంది. దీంతో రాకపోకల విషయంలో వాహనదారులకు ఇబ్బందులు తిరిగి ప్రారంభమయ్యాయి. చేస్తున్న పనులపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కాంట్రాక్టర్ల అవతారమెత్తిన కూటమి నేతలు ఇష్టారాజ్యంగా ఈ పనులు చేపడుతున్నారు. మరికొన్ని రోడ్లలో అసలు పనులే ప్రారంభించ లేదు. మరో వారం రోజుల్లో చేపట్టిన అన్ని రోడ్ల పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు 129 పనుల్లో ఇంకా 35 పనులు చేయాల్సి ఉంది. అంటే దాదాపు 30 శాతం పనులను సంక్రాంతి పండుగ నాటికి పూర్తి కావాలి. ప్రస్తుతం జరిగిన పనులు సైతం తూతూమంత్రంగా చేపట్టడంతో ప్రజాధనం వృథా తప్ప ప్రయోజనం లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముందుకు సాగని

జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు

జిల్లాలో జంగిల్‌ క్లియరెన్స్‌ కింద 550 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా కంపచెట్లు, పిచ్చిమొక్కల తొలగింపు కోసం రూ.80.31 లక్షలు మంజూరు చేశారు. అయితే, ఈ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు కేవలం 258 కిలోమీటర్ల మేర పనులు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మిగతా పనులు ఇంకెప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి.

కాంట్రాక్టర్లకు కలిసి వచ్చేలా..

సంక్రాంతి పండుగలోపు రహదారి మరమ్మతులు, కంపచెట్ల తొలగింపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు హడావుడిగా చేస్తున్నారే తప్ప వాటి నాణ్యతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రెండు రకాలకు సంబంధించి మొత్తం 151 పనులు ఉన్నాయి. వీటిలో సగం వరకు రూ. 5 లక్షల లోపు ఉండటంతో కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే అంశంగా మారింది. రూ. 5లక్షల పైబడి చేసే పనులకు క్వాలిటీ కంట్రోలు నిబంధనలు పాటించాలి. తక్కువ మొత్తంలో ఉన్న వాటికి అవేవీ ఉండవు. దీంతో ఈ పనులు కాంట్రాక్టర్ల అవతారమెత్తిన కూటమి నాయకులకు అప్పగించారు. కాసుల కోసం కొందరు రోడ్లపై తారు, కంకర మిక్సింగ్‌ వేసిన తర్వాత రోలింగ్‌ చేయడం లేదు. మ్యానువల్‌ పద్ధతిలో చేస్తుండటంతో కొద్దిరోజులకే తారు, కంకర లేచిపోతుందని వాహనదారులు వాపోతున్నారు.

రూ.80.31 లక్షలు

జంగిల్‌ క్లియరెన్స్‌ పనులకు

మంజూరైన నిధులు

550 కి.మీ. కంపచెట్లు, పిచ్చిమొక్కల తొలగింపు పనుల రహదారి పొడవు

258 కి.మీ. ఇప్పటి వరకు పూర్తి అయిన పనుల రహదారి పొడవు

No comments yet. Be the first to comment!
Add a comment
ఇది అవుకు– కొండమనాయినిపల్లె రోడ్డు మలుపు. ఈ మార్గంలో 131
1/2

ఇది అవుకు– కొండమనాయినిపల్లె రోడ్డు మలుపు. ఈ మార్గంలో 13

ఇది అవుకు– కొండమనాయినిపల్లె రోడ్డు మలుపు. ఈ మార్గంలో 132
2/2

ఇది అవుకు– కొండమనాయినిపల్లె రోడ్డు మలుపు. ఈ మార్గంలో 13

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement