ఆళ్లగడ్డ: రెడ్‌బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా చేస్తున్న వేధింపులు ఆగడం లేదు. తాజాగా ఆళ్లగడ్డ మున్సిపల్ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కౌన్సిలర్ చక్రపాణిని తాడిపత్రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆయన అరెస్టు విషయం పోలీసులు తమకు తెలియదనడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ కేసు విషయంలో నిందితుడిగా ఉన్న చక్రపాణి తాడిపత్రిలో బంధువుల ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇద్దరు వ్యక్తులు ఆళ్లగడ్డ పోలీసులం అని చక్రపాణిని తమ వెంట తీసుకుపోయారని బంధువులు తెలిపారు. కాగా రాత్రి పొద్దుపోయేవరకు అతడిని ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌కు తీసుకురాకపోవడంతో వచ్చింది పోలీసులా లేక ప్రత్యర్థులు వచ్చి అపహరించుకు పోయారా? అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పట్టణ సీఐ చిరంజీవిని వివరణ కోరగా తాము ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment