ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత
చాగలమర్రి: ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. బుధవారం ఆయన ఏఓ రంగనేతాజి ఆధ్వర్యంలో చాగలమర్రిలోని చింతలచెరువు రస్తాలో జాకీర్‌హుస్సేన్ అనే రైతు పొలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో రబీ సీజన్‌లో 66,591 మంది రైతులు పంట బీమా చేయించారన్నారు. ప్రతి రైతు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని, ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. రబీ సీజన్‌లో సాగు చేసిన వరి, శనగ, మినుము, వేరు శనగ పంటలకు ఈనెల 10వ తేది వరకు బీమా చేయించేందుకు గడువు ఉందని వెల్లడించారు. అనంతరం ఆయన చాగలమర్రిలోని పద్మావతి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. శ్రీలక్ష్మీవెంకటేశ్వర ట్రేడర్స్‌లో కొనుగోలు, అమ్మకం, స్టాకు బిల్లులు సరిగ్గా లేనందున రూ.1.43 లక్షల విలువ చేసే ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఏడీఏ రామ్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి జి.నరేంద్రారెడ్డి, ప్రకృతి వ్యవసాయ రైతులు జయరామిరెడ్డి, నగేశ్వరరెడ్డి, వ్యవసాయ, ఉద్యావన శాఖ సహాయకులు పాల్గొన్నారు.
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో
జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment