ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 80 సీట్ల కోసం 6,035 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,879 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 22 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, కోవెలకుంట్ల, నంద్యాల, నందికొట్కూరులో కేంద్రాలు ఏర్పాటు చేశారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత , నంద్యాల సెయింట్ జోసెఫ్, ఎస్టీ సెయింట్ జోసెఫ్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షల నిర్వహణను డీఈఓ జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. అన్ని చోట్ల పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment