గిరిజనుల ఆర్థికాభివృద్ధిపై సమీక్ష
శ్రీశైలంప్రాజెక్ట్: ట్రైకార్‌తో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఏఏ పథకాలను తీసుకు వస్తే బాగుంటుంది అనే అంశంపై రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి (ఐటీడీఏ)లో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు, సిబ్బంది, గిరిజన నాయకులు హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు గతంలో ఏఏ పథకాలు వర్తించాయి, వాటి కోసం ఎంత మొత్తం నిధులు వినియోగించారు తదితర అంశాలపై సమర్పి ంచిన నివేదికలను పరిశీలించారు. ప్రస్తుతం ట్రైకార్ ద్వారా ఏఏ పథకాలను తీసుకు వస్తే బాగుంటుందనే అనే అంశంపై చర్చించారు. సమావేశంలో డైరెక్టర్లు పి.లావణ్య, టి.అనురాధ, పీఓ కె.వెంకటశివప్రసాద్, ఏపీఓ ఎ.సురేష్‌కుమార్, స్టేట్ గవర్నింగ్ బాడీ కమిటీ సభ్యులు చెవుల అంజయ్య, భూమని మంతన్న, డీఈఈ రియాజ్‌అహ్మద్, జీసీసీ డీవీఎం పుల్లయ్య, హార్టికల్చర్ అధికారి బీసీ ధనుంజయ, ఎన్‌ఆర్‌ఈజీ ఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ కె.గుండాలనాయక్ పాల్గొన్నారు.
● ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పర్యవేక్షణలో గిరిజనులకు ఉపాధి హామీ పనులు కల్పించాలని కొమరంభీం చెంచుగిరిజన సంఘం సభ్యులు వై.ఆశీర్వాదం, వీరయ్య, కొలమయ్య, అక్ష్మీదేవి, మూగమ్మ, వీరమ్మ తదితరులు ట్రైకార్ చైర్మన్ శ్రీనివాసులుకు వినతి పత్రం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment