కక్షపూరితంగానే డీలర్ల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

కక్షపూరితంగానే డీలర్ల తొలగింపు

Published Tue, Jan 21 2025 1:15 AM | Last Updated on Tue, Jan 21 2025 1:15 AM

కక్షపూరితంగానే డీలర్ల తొలగింపు

కక్షపూరితంగానే డీలర్ల తొలగింపు

కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా 25 ఏళ్లనుంచి పనిచేస్తున్న డీలర్లను తొలగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. తొలగించిన డీలర్లపై టీడీపీ నాయకులు కేసులు పెట్టిస్తున్నారని, ఆ పార్టీ తొత్తులుగా అధికారులు పనిచేయడం మంచిది కాదన్నారు. చర్యలు తీసుకోవాలని ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ పి.రంజిత్‌బాషాకు సోమవారం వినతిపత్రం అందజేశారు. కల్లూరు మండలంలో మార్కాపురం, తడకనపల్లె డీలర్లను ఇదివరకే తొలగించారని, ఇటీవల బస్తిపాడు డీలర్‌ రామ్మోహన్‌రెడ్డిని తొలగించి ఆయనతోపాటు మరికొందరిపైనే కేసుపెట్టించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అధికారులపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. ఇళ్లు, పంటలను నాశనం చేస్తున్నారని, ఇందుకు ఇటీవల గడివేముల మండలం పైబోగుల సంఘటనే నిదర్శనమన్నారు. ఎన్ని అక్రమ కేసులుపెట్టినా, ఎంత హింసించినా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు.

అక్రమ కేసులు పెట్టడం మంచిదికాదు

చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు

వినతిపత్రం ఇచ్చిన పాణ్యం మాజీ

ఎమ్మెల్యేకాటసాని రాంభూపాల్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement