శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ జాయింట్ కమిషనర్, ఉత్సవాల ప్రత్యేక అధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావుతో కలిసి ఆయన కై లాసద్వారం, హఠకేశ్వరం, లడ్డూప్రసాదాల విక్రయకేంద్రాలు, దర్శనం క్యూలు, క్యూకాంప్లెక్స్ మొదలైన వాటిని పరిశీలించారు. అనంతరం దేవస్థాన పరిసాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు దర్శనం, మంచినీటి సరఫరా, పాతాళగంగలో పుణ్యస్నానాలు, తలనీలాలు సమర్పణ తదితర వాటితో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వైద్యారోగ్యసేవలు, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్యంపై చర్చించారు. ముందుగా ఈఓ ఎం.శ్రీనివాసరావు బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. అనంతరం ఉత్సవాల ప్రత్యేక అఽధికారి మాట్లాడుతూ కై ంకర్యాల నిర్వహణలో సమయ పాలన పాటించాలన్నారు. కొరత లేకుండా మంచినీటి సరఫరా చేపట్టాలన్నారు. హఠకేశ్వరం వద్ద భక్తులు స్నానాలాచరించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాల ముందు రోజు నుంచే కై లాసద్వారం వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. భక్తులు క్యూలలో అధిక సమయం వేచి ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, సీనియర్ వేదపండితులు, స్థానాచార్యులు, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
కాలిబాటమార్గంలో మంచినీటి
సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ఉత్సవాల ప్రత్యేక అధికారి
చంద్రశేఖర ఆజాద్
Comments
Please login to add a commentAdd a comment