ఫిర్యాదులు పునరావృతం కానివ్వొద్దు
బొమ్మలసత్రం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై 95 మంది అర్జీలు ఇచ్చారు. వాటిని పరిశీలించిన ఎస్పీ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఫిర్యాదుల్లో కొన్ని
● నంద్యాల శివారులోని నందమూరినగర్ వీధికి చెందిన నాగమణి తన తండ్రి ప్రభాకర్‌పై ఫిర్యాదు చేశారు. ఊహ తెలిసినప్పటి నుంచి తన తల్లి ఎవరు ..ఎక్కడుందని అడిగితే తండ్రి సరైన సమాధానం చెప్పడం లేదని వాపోయారు. విచారించి ఆచూకీ కనిపెట్టాలని పోలీసు అధికారులను కోరారు.
● ఫరూక్ అనే వ్యక్తికి ఇల్లు అద్దెకు ఇస్తే ఖాళీ చేయకుండా తిరిగి తననే బెదిరిస్తున్నాడని పట్టణానికి చెందిన షఫీ ఉన్నిసా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
● ఆళ్లగడ్డకు చెందిన మిఖాయిత్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగదు, బంగారు ఆభరణాలు కాజేశాడని ఓ యువతి ఎస్పీ ఎదుట వాపోయారు. మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి తనను న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment