నంద్యాల శనగ–776తో అధిక దిగుబడులు
నంద్యాల(అర్బన్): నంద్యాల శనగ–776 పంట సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్‌లు రామకృష్ణారావు, శివరామకృష్ణ తెలిపారు. మండలంలోని పులిమద్ది గ్రామంలో బుధవారం నంద్యాల శనగ–776 క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. అఖిల భారత సమన్వయ పరిశోధన సంస్థ ప్రణాళికలో భాగంగా గ్రామానికి చెందిన 15 మంది రైతులు 15 ఎకరాల్లో శనగ–776 రకం సాగు చేశారు. ఈ క్షేత్ర ప్రదర్శనలో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రస్తుతం శనగ పంట కోత దశలో ఉన్నట్లు గుర్తించామని, నంద్యాల శనగ 776 రకంలో మొక్కకు సుమారు 80 నుంచి 90 కాయలు వచ్చినట్లు తెలిపారు. రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న జేజీ–11రకంలో 30 నుంచి 40 కాయలు మాత్రమే ఉన్నాయన్నారు. నంద్యాల శనగ 776 రకం ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకొని ఎకరాకు సుమారు 7–8 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త నీలిమ, రైతు సేవా కేంద్రం వీఏఏ సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment