శ్రీశైలంలో 19 నుంచి ‘మహా’ బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థాన పరిపాలనా భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో దేవస్థాన అన్ని యూనిట్ విభాగాల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఈఓ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ నాణ్యతతో వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్ , అలాగే అదనపు ప్రసాదాల విక్రయకేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కై లాసద్వారం, సాక్షిగణపతి మొదలైన ప్రాంతాల్లో చేయవలసిన ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి కావాలని ఆదేశించారు. అన్నప్రసాద వితరణలో తాజా కూరగాయలను వినియోగించాలని సూచించారు. డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, ఈఈలు మురళీబాలకృష్ణ, నరసింహారెడ్డి, పలు విభాగాల ఏఈవోలు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
మార్చి 1 వరకు నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment