నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
బండి ఆత్మకూరు: జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్సీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. బుధవారం ఆయన బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో రికార్డులు పరిశీలించి కేసుల దర్యాపు పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో పరిసరాల పరిశుభ్రత , హాజరు నమోదు, ఆయుధాలు, లాకప్ గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో ప్రజలకు సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. నేర చరిత్ర గల వారిపై ఎప్పుడూ నిఘా ఉంచాలని, ప్రజలను సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. తనిఖీలో ఎస్పీ వెంట నంద్యాల రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి, బండి ఆత్మకూరు ఎస్‌ఐ జగన్ మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment