రూ.86,400 నగదు సీజ్‌ | Sakshi
Sakshi News home page

రూ.86,400 నగదు సీజ్‌

Published Wed, Apr 17 2024 1:30 AM

-

కృష్ణా: మండలంలోని రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా చెక్‌పోస్టులో మంగళవారం ఎస్‌ఐ ఎండీ నవీద్‌, కేంద్ర సాయుధ బలగాలు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ.86,400ల నగదు లభించడంతో ఆ నగదును సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి ఉట్కూర్‌కు వెళ్తున్న కురువ అంజప్ప ఎలాంటి అనుమతులు లేకుండా నగదును తీసుకెళ్తుండగా.. తాము స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదును తీసుకెళ్తే, వాటికి సంబంధించి ఆధారాలు లేకుంటే సీజ్‌ చేస్తామని చెప్పారు. అనంతరం ఆ నగదును నారాయణపేట్‌ గ్రీవెన్స్‌ కమిటీకి పంపించినట్లు వివరించారు.

బాలానగర్‌లో రూ. 59 వేలు..

బాలానగర్‌: మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద మంగళవారం రూ.59 వేలుపట్టుకున్నట్లు ఎస్‌ఐ తిరుప్పాజీ తెలిపారు. కర్నూలుజిల్లా దేవరకొండ మండలం బేతపల్లికి చెందిన లక్ష్మయ్య ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తరలిస్తుండగా.. స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement