లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం
నారాయణపేట ఎడ్యుకేషన్: లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటే కేసులు త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ.. డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని పోలీస్ అధికారులకు తెలిపారు. తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కారం పొందేలా చూడమని సూచించారు. జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను అడిగి తెలుసుకొని, ఈ లోక్ అదాలత్‌లో త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ పెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఎకై ్సజ్‌శాఖలో ఇలా మొత్తం 6500 కేసులను టార్గెట్‌గా నిర్దేశించారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో 80 నుంచి 90శాతం వరకు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్, అడిషనల్ జూనియర్ జడ్జి సయ్యద్ జాకియా సుల్తానా, ఆర్డీఓ రామచందర్‌నాయక్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ లన్సమ్‌పతి గౌడ్, నాగేశ్వ, సురేష్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment