నారాయణపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నారాయణపేటలో స్టెనో, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టెనో /టైపిస్ట్ 1 (జనరల్), రికార్డ్ అసిస్టెంట్ 1 పోస్ట్ (జనరల్), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి అభ్యర్థులు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఈ నెల 30 సాయంత్రం 5 గంటలలోగా చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్, జిల్లా కోర్టు ప్రాంగణం నారాయణపేట కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దీంతోపాటు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీలు రూ.400 డీడీ రూపంలో ‘ది సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నారాయణపేట‘ పేరున చెల్లించి డీడీ జతపర్చాలని పేర్కొన్నారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు, వివరాలకు (ecourts.gov.in/ narayanpet) సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment