చుట్టుపక్కల విస్తరించడం ఆనందంగా ఉంది..
నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తితో నా ఇంటిపై ఇంత పెద్ద మిద్దె తోట తయారు చేసుకోగలిగాను. నా కుటుంబసభ్యులు రసాయనాలు వాడని కూరగాయలు, పండ్లు తినాలనే సంకల్పంతో మిద్దె తోటను ప్రారంభించాను. సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ఇంటిపై భాగంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు నాతోపాటు చుట్టుపక్కల వారు, మా బంధువులు సైతం ఇలాంటి మిద్దె తోటలు నిర్మాణం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రకృతి ప్రేమికుడిగా ప్రకృతి సేవాదళ్ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాం.
– సత్యనారాయణ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment