విద్యుత్ కార్మికులపై పనిభారం
నారాయణపేట టౌన్: రాష్ట్రంలో విద్యుత్ కార్మికులపై పనిభారం పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నట్లు 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డివిజన్, నూతన సర్కిల్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న జేఎల్‌ఎం, ఎల్‌ఏఎల్‌ఎం, ఎల్‌ఎంలకు పనిభారం పెరిగిందన్నారు. ఏడు గ్రామాలకు ఒక జేఎల్‌ఎం చొప్పున పనిచేస్తున్నారని తెలిపారు. కర్ణాటక సరిహద్దున నారాయణపేట ఉండటంతో సిబ్బంది కొరత ఉందన్నారు. జేఎల్‌ఎంల నియామకం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
● నారాయణపేట నూతన సర్కిల్‌లోని ప్రతి విభాగంలో అధికారులకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఎస్‌ఈ సంజీవరెడ్డి చెప్పారు. నూతన సర్కిల్ కావడంతో ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి అధికారులు వచ్చేలా చూడాలన్నారు. అనంతరం నారాయణపేట సర్కిల్, డివిజన్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డిస్కం ప్రెసిడెంట్ వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న, అడిషనల్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, మహబూబ్‌నగర్ సర్కిల్ రీజినల్ ప్రెసిడెంట్ స్వామి, సెక్రటరీ పాండు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదయ్య గౌడ్, శ్రీనివాస్, ఎస్‌ఏఓ వెంకటేశ్వర్లు, డీఈ నర్సింహారావు, ఎంఎన్‌పీ డీఈటీ డీఈ శ్రీనివాస్, జితేందర్, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ. అనిల్, రఫీ, బాల్‌రాజు, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment