15 రోజులైన కొనుగోలు చేయలేదు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది నారాయణపేట జిల్లా కృష్ణ మండలం హిందూపూర్ గ్రామానికి చెందిన రైతు మహేష్. కృష్ణలోని కొనుగోలు కేంద్రానికి 15 రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు లేదు. దీంతో చేసేది లేక ఒకట్రెండు రోజులు చూసి కర్ణాటక మిల్లర్లకు విక్రయించాలనుకుంటున్నాడు. 14 శాతం తేమ వచ్చినప్పటికీ ధాన్యంను కొనుగోలు చేయడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాయచూర్‌లో విక్రయం
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు మాగనూర్‌కు చెందిన మారెప్ప. ఆరు ఎకరాల్లో వరి సాగు చేసి 168 బస్తాలు పండించారు. ప్రభుత్వ నిబంధనలతో ఇబ్బందులు కావడంతో కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లో ప్రైవేట్ మిల్లర్లకు విక్రయించారు. క్వింటాల్ రూ.2,040 చొప్పున అమ్మినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment