తేమశాతం ఉండట్లేదు..
జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నిర్ణీత తేమశాతం కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉండగా ఇందుకు సమయం పడుతోంది. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న బోనస్ కేవలం రెండు రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ అవుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– రాజయ్య, జిల్లా పౌర సరఫరాశాఖ మేనేజర్, నాగర్‌కర్నూల్
ప్రైవేటులో తక్కువకే..
నేను ఈ సారి 1.50 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశాను. మా గ్రామంలో ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో 30 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నాను. మా ఊరిలో కేంద్రం ప్రారంభం కాక చాలా మంది రైతులు ప్రైవేటుకే అమ్ముకుంటున్నారు.
– అలేటి బాలయ్య, రైతు, రాయిపాకుల, తెలకపల్లి మండలం
●
Comments
Please login to add a commentAdd a comment