ఊపందుకోనికొనుగోళ్లు
ఉమ్మడి జిల్లాలోఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
● చాలాచోట్ల తేమశాతం పేరుతో ముందుకు సాగని కొనుగోళ్లు
● సింహభాగం ప్రైవేటు వ్యాపారులకే తరలుతున్న సన్నాలు
● ప్రభుత్వం ఇచ్చే బోనస్ కోల్పోతున్న రైతులు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ఇంకా ఊపందుకోలేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల కేంద్రాలను ప్రారంభించామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. చాలాచోట్ల ఇప్పటివరకు ధాన్యం సేకరణ మొదలుపెట్టలేదు. తేమశాతం పేరుతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఓ వైపు కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం, నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఆరబోసేందుకు వీలుకాక తక్కువ ధరకే ప్రైవేటుకు అమ్ముకుని నష్టపోతున్నారు. ఈసారి సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ ధరను ప్రకటించినప్పటికీ చాలామంది రైతులు ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ధరను లబ్ధిపొందలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment