రైతులను బిందు సేద్యం వైపు మళ్లించాలి
మరికల్: వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులను సాధించేందుకు రైతులను బిందు సేద్యం వైపు మళ్లించేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తీరణ అధికారులు చర్యలు తీసుకోవాలని జేడీఏ విజయ్ గౌరీ అన్నారు. మరికల్ రైతు వేదిక అవరణలో గురువారం జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు నీటి సంరక్షణ సాగు నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే నీటి కొలతలు, నీటిని ఎలా సంరక్షించే విధానలపై, నేల ఆరోగ్యం, ప్రకృతి వ్యవసాయం గూర్చి వారికి వివరించారు. ముఖ్యంగా ప్రతి రైతు బిందు సేద్యం పద్దతి పాటిస్తే అధిక దిగుబడలతో పాటు లాభాలను ఆర్జించవచ్చాన్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలపై వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ సునీత, వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, డీజీఎం నేటఫీమ్ సుబ్బారావు, జిల్లా వ్యవసాయఽ అదికారి జాన్‌సుధాకార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment