ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
నారాయణపేట: జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఈ నెల 25న ఘనంగా నిర్వహించాలని శిక్షణ కలెక్టర్ గరిమానరుల ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 15వ జాతీయ ఓటరు దినోత్సవంపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డు, గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ర్యాలీ అనంతరం ప్రతిజ్ఞ ఉంటుందని తెలిపారు. పాఠశాల, కళాశాల స్థాయిలో క్విజ్ పోటీలు, ముగ్గులు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్, డీఈఓ గోవిందరాజులు, అధికారులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న శిక్షణ కలెక్టర్ గరిమానరుల
Comments
Please login to add a commentAdd a comment