ఇంటింటికి తాగునీరే ‘అమృత్’ లక్ష్యం
కోస్గి: దేశంలోని ప్రతి గ్రామం అన్నిరంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ రూ.కోట్లు మంజూరు చేస్తున్నారని.. ముఖ్యంగా ప్రతి ఇంటికి శుద్ధజలం అందించేందుకు అమృత్ పథకం అమలు చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా కోస్గి పురపాలికలో రూ.12.50 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు రాష్ట్ర పోలీస్ హౌజింగ్ సొసైటీ చైర్మన్ గుర్నాథ్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు మంజూరు చేస్తోందని చెప్పారు. కాడా చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రాంచందర్‌నాయక్, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్‌రెడ్డి, డీఈ మల్లేష్, ఏఈ జ్ఞానేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మున్సిపల్ చైర్‌పర్సన్ కోడిగంటి అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్‌లో 14వ స్థానం
నారాయణపేట: గతేడాది డిసెంబర్ 14న నిర్వహించిన లోక్ అదాలత్‌లో జిల్లాలోని 6,912 కేసులను పరిష్కరించి 14వ స్థానంలో నిలిచామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కో–ఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల రాజీకి కృషి చేసిన పోలీసు అధికారుల బృందాన్ని ఆయన అభినందించారు. నేషనల్ లోక్ అదాలత్–2025 షెడ్యూల్‌ని ప్రకటించి కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారుడు, నేరస్తులు తమ ఆధార్‌కార్డు తీసుకొని సంబంధిత కోర్టు/ప్రదేశంలో హాజరుకావాలని తెలిపారు. రాజీమార్గంలో అధికసంఖ్యలో సమస్యలను పరిష్కారం చేయాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో చార్జ్‌షీట్ పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయమూర్తులు వింధ్యనాయక్, మహ్మద్ ఉమర్, జకీయా సుల్తానా, ఫారీన్‌బేగం, కోస్గి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ లక్ష్మీపతిగౌడ్, నాగేశ్వరి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మెనూశ్రీ, సురేష్‌కుమార్, బాలప్ప, డీఎస్పీ లింగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment