భళా.. బాలశాస్త్రవేత్తలు
నారాయణపేట
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి.. వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జడ్చర్ల మండలం పోలేపల్లి ఎస్‌వీకేఎంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మంగళవారం ప్రారంభమైంది. ప్రస్తుతం సమాజంలో పలు సమస్యలకు పరిష్కారం చూపేలా బాలమేధావులు రూపొందించిన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. – జడ్చర్ల/జడ్చర్ల టౌన్
బుధవారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2025
వివరాలు 8లో u
● అబ్బురపరిచేలా
విద్యార్థుల ఆవిష్కరణలు
● రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన
జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ
సంజీవని హెలీకాప్టర్..
హెలీకాప్టర్ ప్రమాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణితో పాటు పలువురు మృత్యువాతపడిన దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ప్రణీత్ కుమార్ తన గైడ్ శోభారాణితో కలిసి ‘సంజీవని హెలీకాప్టర్’ ప్రయోగాన్ని ప్రదర్శించారు. హెలీకాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు బుల్లెట్ ప్రూఫ్, ఫైర్‌ప్రూప్‌తో కూడిన బెలూన్ ఓపెన్ అయి సురక్షితంగా బయటపడేందుకు వీలుగా రూపొందించారు. ఎయిర్ బెలూన్‌లోనే ఆక్సిజన్ ఉండటం వల్ల అందులో ప్రయాణించే వారికి ఎలాంటి ప్రాణహాని ఉండదు. దీనికి జీపీఎస్ అనుసంధానం ఉండటం వల్ల హెలీకాప్టర్ క్రాషెస్‌ను గుర్తించేందుకు సులువవుతుంది.
అల్ట్రాసోనిక్ హెల్మెట్
వినికిడి లోపం ఉన్నవారితో పాటు వాహనదారులందరికీ బైక్ నడిపే సమయంలో ప్రమాదాల నివారణకోసం అల్ట్రాసోనిక్ హెల్మెట్‌ను ఖమ్మం జిల్లా చెన్నారం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ప్రియ గైడ్ రామారావుతో కలసి రూపొందించారు. వాహనం నడిపేటప్పుడు సెన్సార్‌ల ఆధారంగా హెల్మెట్ గ్లాస్‌కు కంటికి కనిపించే విధంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ లైట్లను ఏర్పాటు చేశారు. గ్లాస్‌కు ఏర్పాటైన లైట్ల ఆధారంగా గ్రీన్ అయితే సేఫ్ జోన్‌లో వెళ్తున్నట్లు, ఆరెంజ్ లైట్ పడితే అలర్ట్‌గా ఉండాలని, రెడ్ అయితే డేంజర్ జోన్‌లో వెళ్తున్నట్లు గుర్తించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. దీని ఖర్చు కేవలం రూ.400 నుంచి రూ.1,000 వరకు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment