జీతం, పింఛన్ రాక ఇబ్బందులు
గతంలో అంగన్‌వాడీ ఆయాగా పని చేస్తుండటంతో ఆసరా పింఛన్ తీసేసిండ్రు. 65 ఏళ్ల వయస్సు నిండటంతో అంగన్‌వాడీ కేంద్రంలో ఆయా జీతం నుంచి తీసెసిండ్రు. అటు జీతం రాక, ఇటు పింఛన్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. రిటైర్డ్ కాగానే ఆర్థిక సాయం ఇస్తామన్నారు. ఆరు నెలలుగా సాయం కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పటికై నా రిటైర్మెంట్ సాయం వెంటనే అందించాలి.
– మాణెమ్మ, రిటైర్డ్ ఆయా, కోస్గి
హామీ నిలబెట్టుకోవాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేసి పదవీ విరమణ పొందిన వారందరికి ప్రభుత్వం నుంచి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ ఆరు నెలలు గడిచినా నేటికి ఇవ్వక పోవడం సరికాదు. గతంలో ఇచ్చిన హామీ మేరకు టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.1లక్ష పదవీ విరమణ సాయం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆదుకోవాలి.
– శశికళ, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు
●
ఆదేశాలు రావాల్సి ఉంది
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించి రిటైర్మెంట్‌కు అర్హత ఉన్న వారి జాబితాను రాష్ట్ర కమిషనరేట్‌కు అందజేశాం. జిల్లాలో 74 మందికి అర్హత ఉండటంతో వారందరికీ ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించింది. రిటైర్మెంట్ బెనిఫిట్‌కు సంబంధించిన విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. నిధులు మంజూరు కాగానే నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
– జయ, డీడబ్ల్యూఓ, నారాయణపేట
Comments
Please login to add a commentAdd a comment