అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించాలి
నారాయణపేట: ప్రతి గ్రామంలో 30 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, షుగర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని.. అసంక్రమిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్‌ఎంలకు అసంక్రమిత వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈమేరకు డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో విధిగా పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించాలని, బీపీ, షుగర్‌తో బాధపడే వారికి క్రమం తప్పకుండా మందులు అందించాల్సిన బాధ్యత ప్రతి ఏఎన్‌ఎంపై ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మందులు వాడుతున్న రోగులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మందులు అందివ్వాలని, డ్రగ్స్ రిజిష్టర్ మెయిన్‌టేన్ చేయాలని, అలాగే వీరందిరి వివరాలు ఎన్‌సీడీ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో డీపీఓ బిక్షపతి, సిబ్బంది శ్రీనివాసులు, వసంత, స్నేహ, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment