![నిలిచిన మధ్యాహ్న భోజనం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05mkl703-210167_mr-1738785473-0.jpg.webp?itok=Xfjd0aT1)
నిలిచిన మధ్యాహ్న భోజనం
కోస్గి రూరల్: వంట ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల రెండు రోజులుగా మధ్యాహ్న భోజనం అందించడం లేదని విద్యార్థులు ధర్నాకు దిగారు. మండలంలోని చెన్నారం ప్రాథమిక పాఠశాలలో రెండు రోజులుగా మధ్యాహ్న భోజనం వండకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నారాయణపేట–పల్లెర్ల రహదారిపై బుధవారం ధర్నా చేపట్టారు. మెనూ అస్సలు పాటించడంలేదని, గుడ్లు, అరటిపండ్లు ఇవ్వడంలేదని, విధిలేని పరిస్థితుల్లో ఇళ్ల నుంచి టిఫిన్ బాక్సులు పంపిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. పాఠశాల హెచ్‌ఎం అనురాధకు వంట ఏజెన్సీ నిర్వాహకురాలు బాలమణికి మధ్య వివాదం చోటుచేసుకుందని, దీని వల్లనే భోజనం బంద్ చేశారని ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎంఈఓ శంకర్‌నాయక్ అక్కడికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని, మెనూ పాటించేలా చూస్తానని అన్నారు. అలాగే, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే చర్యలు చేపడతామని హెచ్‌ఎం, వంట ఏజెన్సీ నిర్వాహకురాలిని హెచ్చరించారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment