![కొరమీను చేపల సాగుతో అధిక ఆదాయం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05nrpt301-210086_mr-1738785475-0.jpg.webp?itok=OrvQjGFr)
కొరమీను చేపల సాగుతో అధిక ఆదాయం
మరికల్: తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు రైతులు కొరమీను చేపల సాగు వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. మండలంలోని పల్లెగడ్డ, మాధ్వార్ క్రాసింగ్ దగ్గర రామ్‌కి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చేపల షెడ్‌ను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెతోపాటు రామ్‌కి పౌండేషన్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. కేవలం నాలుగు గుంటల స్థలంలో రూ. 4.40 లక్షల వ్యయంతో ఈ షెడ్ నిర్మాణం చేపట్టి, వాటిలో ఏర్పాటుచేసిన వాటర్‌ట్యాంకులో కొరమీను చేపలను వదలాలని సూచించారు. మొదటి పంట 8 నెలలకు వస్తుందని, మిగితా పంటలు నాలుగు నెలలకోసారి వస్తాయని, ఒకసారి పంటను విక్రయిస్తే రూ.90 వేల వరకు ఆదాయం వస్తుందని, ఇలా ఏడాదికి మూడు సార్లు తీయవచ్చాన్నారు. నియోజకవర్గంలో మొదట 50 మంది రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాంరెడ్డి, సంజీవ్‌నాయర్, సూర్యమోహన్‌రెడ్డి, హరీష్, సత్యన్న, రామకృష్ణ, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, గొల్లరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment