![‘పది’లో వంద శాతంఉత్తీర్ణత సాధించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05nrpt601-210166_mr-1738785473-0.jpg.webp?itok=t7iuhFGd)
‘పది’లో వంద శాతంఉత్తీర్ణత సాధించాలి
నారాయణపేట: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల అన్నారు. జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహిస్తుండగా.. ఆమె పాల్గొని మాట్లాడారు. మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు, వసతి గృహాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉమాపతి, జాన్ సుధాకర్, అబ్దుల్ ఖలీల్, ఉపాధ్యాయులు స్వామి, సంగీత, నారాయణరెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.
నేతన్న పొదుపు పథకానికి దరఖాస్తు చేసుకోండి
నారాయణపేట: నేతన్న పొదుపు పథకానికి (త్రిఫ్ట్ ఫండ్) చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు డి.బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు నేతన్న పొదుపు పథకాన్ని పునఃప్రారంభం చేసి నూతన మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. పథకం గడువు రెండేళ్లుగా నిర్ణయించిందని, చేనేత కార్మికులు, అనుబంధ చేనేత కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ కాపీ, 6 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేసి దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. ఈ నెల 15 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
అలసందలు క్వింటాల్ రూ.6,666
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం అలసందలు క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.6,666 ధర పలికింది. అలాగే, వేరుశనగ గరిష్టంగా రూ.5,858, కనిష్టంగా రూ.4,005, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,250, కనిష్టంగా రూ.6,080, తెల్ల కందులు గరిష్టంగా 7,521, కనిష్టంగా రూ.6,419 ధరలు పలికాయి.
దిగొచ్చిన ఉల్లి ధర
● గరిష్టంగా రూ.2.710.. కనిష్టం రూ.1,700
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం నిర్వహించిన ఉల్లి వేలంలో ధరలు మరింత దిగొచ్చాయి. మూడు వారాల కిందట వచ్చిన ధరలతో పోలిస్తే సగానికి పడిపోయింది. ఎర్ర ఉల్లి ఎక్కువగా ఉండడం, తెల్ల ఉల్లి వచ్చినా ఆరబెట్టకపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. నాణ్యమైన ఉల్లి క్వింటా గరిష్టంగా రూ.2,710 పలకగా.. రెండు వారాల కిందట రూ.4,020గా నమోదైంది. ఆ ధరతో పోలిస్తే రూ.1,310 వరకు తగ్గింది. కనిష్టంగా రూ.1,700 ధర ఉండగా.. రెండు వారాల కిందట రూ.3,510గా ఉందని. ఆ ధరతో పోలిస్తే రూ.1,800 వరకు తగ్గింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 45 కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,400, కనిష్టంగా రూ.8,50 ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగించారు. కాగా.. మధ్యాహ్నం జరిగిన ఈ–టెండర్‌లో కంది క్వింటా గరిష్టంగా రూ.6,901, కనిష్టంగా రూ. 6,569 ధర లభించాయి. మార్కెట్‌కు దాదాపు 100 బస్తాల కంది అమ్మకానికి వచ్చింది.
వేరుశనగ క్వింటాల్ రూ.6,312
జడ్చర్ల/నవాబుపేట: బాదేపల్లి మార్కెట్ యార్డుకు బుధవారం 4,930 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.6,312, కనిష్టంగా రూ.4,005 ధరలు లభించాయి. కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,596, కనిష్టంగా రూ.5,669, మొక్కజొన్న రూ.2,390, పెబ్బర్లు గరిష్టంగా రూ.5,701, కనిష్టంగా రూ.5,202, ఉలువలు గరిష్టంగా రూ.6,359, కనిష్టంగా రూ.5,859 ధరలు పలికాయి. నవాబుపేట మార్కెట్‌కు 3,596 బస్తాల వేరుశనగ వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. గరిష్టంగా రూ.5,911 ధర పలికిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment