![మరోసారి ఇలాంటివి పునరావృతం కావొద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mkl703-210167_mr-1738869673-0.jpg.webp?itok=sRu1bxxB)
మరోసారి ఇలాంటివి పునరావృతం కావొద్దు
కోస్గి రూరల్: పాఠశాల హెచ్‌ఎం, వంట ఏజెన్సీ నిర్వాహకుల మధ్య గొడవ నేపథ్యంలో రెండు రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందివ్వకపోవడం, దీనిని నిరసిస్తూ బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగడంతో డీఈఓ గోవిందరాజులు, డీఆర్‌డీఓ మొగులప్ప మండలంలోని నాచారం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. హెచ్‌ఎం, వంట ఏజెన్సీ మహిళను విచారించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని హెచ్చరించారు. వారితో లిఖితపూర్వకంగా రాయించుకున్నారు. ఇదిలాఉండగా, పలువురు గ్రామస్తులు హెచ్‌ఎంను బదిలీ చేయాలని ఫిర్యాదు చేశారు. పూర్తి నివేదికను అధికారులకు పంపించిన అనంతరం చర్యలు చేపడతామని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, ఎంఈఓ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment