ఎదురుచూపులు..!
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులపై ఎన్నో ఆశలు
●
కొత్త కార్డులు ఇవ్వాలి
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇటీవల ఏర్పాటు చేసిన గ్రామసభలో కూడా మరోసారి దరఖాస్తు చేశాం. ప్రభుత్వం నుంచి అమలు చేసే పథకాలకు రేషన్‌కార్డు ప్రమాణికం కావడంతో కార్డు లేక సంక్షేమ పథకాలను కోల్పోతున్నాం. కొత్త కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం.
– నరేష్, మరికల్
ఒకేసారి రైతు భరోసా వేయాలి
రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా అందిస్తే బాగుంటుంది. మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి వారి ఖాతాల్లో వేయడంతో మిగితా గ్రామాల రైతులు పెట్టుబడి సహాయం కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను ఏకకాలంలో అమలు చేస్తే బాగుటుంది.
– మల్లేష్, పెద్దచింతకుంట
ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది
ముందుగా గుర్తించిన గ్రామాల్లో కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుంది. వారం రోజుల వ్యవధిలో ఆయా గ్రామాల్లో అర్హులను గుర్తించిన తర్వాత మిగితా గ్రామాల్లో అర్హులను గుర్తిస్తాం. అలాగే రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా ప్రక్రియ కూడా ఆన్‌లైన్‌లో మార్చి 31 లోపు పూర్తి చేస్తాం.
– రాంచందర్, ఆర్డీఓ, నారాయణపేట
మరికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, నూతన రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు గత నెల 26న లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందించారు. ఇటీవల మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా గ్రామాల్లోని లబ్ధి దారుల బ్యాంకు ఖాతాలో ్ల రైతు భరోసాకు సంబంధించిన ఆర్థిక సాయం జమ చేశారు. కానీ మిగిత గ్రామాల రైతులకు రైతు భరోసా అందకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని మిగతా గ్రామాల్లోని అర్హులు కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 280 గ్రామసభలు, 56 మున్సిపల్ వార్డుసభలకు సంబందించి నాలుగు సంక్షేమ పథకాలకు గాను 61,365 దరఖాస్తులు వచ్చాయి. మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రైతు భరోసా అందివ్వడంతో మిగతా గ్రామాలకు పథకాలు ఎప్పుడు చేరతాయి.. అసలు చేరతాయా లేదా అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
గ్రామసభల్లో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు లేవని అనేక మంది మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు పరిశీలించి అత్యధిక అర్జీలను ఆమోదించి అర్హుల జాబితాల్లో చేర్చారు. అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లో గత నెల 26న సమావేశాలు జరిగాయి. అర్హతనే ప్రామాణికంగా తీసుకుని సొంత స్థలం కలిగిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల అర్హత పత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. నూతన రేషన్‌కార్డులకు సంబంధించి అర్హుల జాబితాలో పేరొచ్చిన వారి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త కార్డులు జారీ చేయనున్నారు. మిగతా గ్రామా ల్లోనూ జాబితాలు సిద్ధం చేశామని, ఆదేశాలు వస్తే అర్హత పత్రాలు అందిస్తామని అధికారులు అంటున్నారు.
జాబితాలు సిద్ధం
సంక్షేమ పథకాల అమలుపై వీడని సందిగ్ధం
ఎంపిక చేసిన గ్రామాలకే మొదటి ప్రాధాన్యత
అర్హుల్లో అనేక సందేహాలు
ఎదురుచూపులు..!
ఎదురుచూపులు..!
Comments
Please login to add a commentAdd a comment