వాలీబాల్‌ అకాడమీ.. అటకెక్కించారు! | - | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ అకాడమీ.. అటకెక్కించారు!

Published Fri, Feb 7 2025 1:02 AM | Last Updated on Fri, Feb 7 2025 1:01 AM

వాలీబ

వాలీబాల్‌ అకాడమీ.. అటకెక్కించారు!

మెయిన్‌ స్టేడియంలో మూడేళ్ల క్రితం పునఃప్రారంభం

గ్రామీణ క్రీడాకారులు

వెలుగులోకి వస్తారు..

మహబూబ్‌నగర్‌లో గతంలో ఉన్న వాలీబాల్‌ అకాడమీలోనే నేను ఓనమాలు నేర్చుకున్న. అకాడమీ నుంచి అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయస్థాయి మ్యాచుల్లో ఆడాను. స్పోర్ట్స్‌ కోటాలో ఇన్‌కమ్‌ టాక్స్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం కూడా వచ్చింది. వాలీబాల్‌ హాస్టళ్లు, అకాడమీ ఏర్పాటయితే నా లాంటి ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు.

– యశ్వంత్‌కుమార్‌,

అంతర్జాతీయ క్రీడాకారుడు, మహబూబ్‌నగర్‌

త్వరలో ప్రవేశాలు

వాలీబాల్‌ అకాడమీలో ప్రవేశాల గురించి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణకు నివేదిక ఇచ్చాం. అనుమతులు రాగానే అకాడమీ సెలక్షన్స్‌, ప్రవేశాలు నిర్వహిస్తాం. అకాడమీ ఏర్పాటు తో నైపుణ్యం గల క్రీడాకారులను వెలికి తీయవచ్చు. క్రీడాకారులకు మెరుగైన వసతి, ఉత్తమమైన శిక్షణ లభిస్తుంది.

– ఎస్‌.శ్రీనివాస్‌,

డీవైఎస్‌ఓ, మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్‌ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ పాలమూరు జిల్లాకు వాలీబాల్‌ అకాడమీని మంజూరు చేసింది. నాలుగేళ్ల పాటు నడిచిన అకాడమీలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ చాటారు. దీంతో అప్పట్లో ఈ వాలీబాల్‌ అకాడమీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడ శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్‌ క్రీడాకారులుగా ఎదిగారు. వీరు మొదట్లో అకాడమీలో వాలీబాల్‌లో ఓనమాలు నేర్చుకొని దేశానికి ప్రాతినిథ్యం వహించేస్థాయికి ఎదిగారు. పలువురు క్రీడాకారులు జాతీయ సీని యర్‌ వాలీబాల్‌ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008లో ఈ అకాడమీని మూసివేశారు.

మూడేళ్ల క్రితం వసతుల ఏర్పాటు..

జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో వాలీబాల్‌ అకాడమీని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ పెరగడంతో.. మూడేళ్ల క్రితం వాలీబాల్‌ అకాడమీ తిరిగి పునఃప్రారంభమైంది. రూ.19.70 లక్షల నిధులతో స్టేడియం ఆవరణలోని స్విమ్మింగ్‌పూల్‌ కాంప్లెక్స్‌ గదులను అకాడమీ క్రీడాకారుల వసతి కోసం కేటాయించారు. గదుల ఆధునికీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు. మంచాలు, టేబుల్స్‌, బీరువాలతో పాటు క్రీడాకారుల వసతి కోసం ఇతర వస్తువులను కూడా సిద్ధంగా ఉంచారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్‌ కోర్టులను తీసి వేసి వాటి స్థానంలో నూతన కోర్టులు ఏర్పాటు చేశారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్‌ లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. గోడ చుట్టూ ఆకర్షణీయంగా వాలీబాల్‌ క్రీడాచిత్రాలను తీర్చిదిద్దారు.

ప్రవేశాలపై సందిగ్ధం?

మెయిన్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన నూతన వాలీబాల్‌ అకాడమీలో ప్రవేశాల కోసం 2022 డిసెంబర్‌ 1వ తేదీన రాష్ట్రంలోని అండర్‌ 14–18 ఏళ్ల బాలబాలికలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 187 మంది బాలురు, 46 బాలికలు.. మొత్తం 233 మంది ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని అకాడమీకి ఎంపిక చేయాల్సి ఉంది. అయితే సెలక్షన్‌ నిర్వహించి రెండేళ్లు దాటినా.. క్రీడాకారులకు ప్రవేశాలు కల్పించలేదు. కోచ్‌ల నియామకాలు కూడా జరగలేదు. ఒకవేళ అకాడమీ ప్రారంభిస్తే.. గతంలో జరిగిన సెలక్షన్స్‌లో ప్రతిభ చాటిన వారికి ప్రవేశాలు ఇస్తారా లేదా మళ్లీ కొత్తగా సెలక్షన్స్‌ నిర్వహిస్తారా అనే దానిపై సందిగ్ధం ఏర్పడింది.

ి● వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటు చేయడం వల్ల ఔత్సాహిక క్రీడాకారులకు మహర్దశ కలుగుతుంది. నిష్ణాతులైన కోచ్‌ల పర్యవేక్షణలో బాలబాలికలకు మెరుగైన శిక్షణ అందజేసి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దుతారు. అయితే మూడేళ్ల క్రితమే అకాడమీ తిరిగి ప్రారంభమైనా ప్రవేశాలు కల్పించకపోవడంపై సీనియర్‌ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా ప్రవేశాలు కల్పించాలని సీనియర్లు కోరుతున్నారు.

రెండేళ్ల క్రితం రాష్ట్రస్థాయి ఎంపికలు

సైతం పూర్తి

అంతటితోనే ఆగిపోయిన ప్రక్రియ

అకాడమీలో క్రీడాకారుల ప్రవేశాలపై సందిగ్ధం?

No comments yet. Be the first to comment!
Add a comment
వాలీబాల్‌ అకాడమీ.. అటకెక్కించారు!1
1/2

వాలీబాల్‌ అకాడమీ.. అటకెక్కించారు!

వాలీబాల్‌ అకాడమీ.. అటకెక్కించారు!2
2/2

వాలీబాల్‌ అకాడమీ.. అటకెక్కించారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement