![కోలాహలంగా పాల ఉట్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05mkl111-210057_mr-1738785474-0.jpg.webp?itok=ZXlJyZXL)
కోలాహలంగా పాల ఉట్లు
మక్తల్: మండలంలోని మాద్వార్‌లోని గట్టుతిమ్మప్పస్వామి (లక్ష్మీవెంకటేశ్వరస్వామి) బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన పాల ఉట్ల కార్యక్రమం వైభవంగా సాగింది. భక్తుల కోలాటం, చిన్నారులు దాండియా నృత్యాలు, అడుగుల భజనలు చేస్తూ ఊరేగింపుగా ముందుకు కదిలారు. అనంతరం వందలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ పాల ఉట్లు కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఉట్టి కొట్టేందుకు యువకులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజేశ్వర్‌రావు, జాజాపూర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment