ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో అర్హుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఎంపిక గ్రామాల్లో గర్తించిన అర్హులకే మొదటి విడతలో ఇళ్లను కేటాయిస్తారా, లేదా అన్ని గ్రామాల్లో అత్యంత నిరుపేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇప్పటికే ఎంపిక చేసిన గ్రామాల్లో పలువురికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హత పత్రాలు అందించారు. అయితే ఒక్కో నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 గృహాలను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో అర్హుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అర్హత పత్రాలు పొందిన వారందరికీ తొలి విడతలో ఇళ్లు మంజూరు కావని అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యం దక్కనుందని సమాచారం. అయితే ఎంపిక చేసిన గ్రామాల్లోనే కాకుండా మిగతా ఊళ్లల్లోని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లువ్వాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment