![సూర్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/mn5rr_mr-1739221388-0.jpg.webp?itok=J-aizxZH)
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం రాత్రి సూర్యప్రభవాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, రకరకాల పూల అలంకరణల మధ్య స్వామివారు భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
నేడు హనుమత్‌వాహన సేవ.. ప్రభోత్సవం
మన్యంకొండలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి హనుమత్‌వాహన సేవ నిర్వహించనున్నారు. అలాగే అదేరోజు రాత్రి ప్రభో త్సవం కూడా జరుపుతారు. ప్రభోత్సవ కార్యక్రమం రథోత్సవం మాదిరిగానే తేరు మైదానంలో కొనసాగనుండగా.. వేలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
![సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/mn3rr_mr-1739221388-1.jpg)
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
Comments
Please login to add a commentAdd a comment