![అందరి సహకారంతో విద్యాభివృద్ధి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mkl401-210060_mr-1739221389-0.jpg.webp?itok=8zhZF5f5)
అందరి సహకారంతో విద్యాభివృద్ధి
నర్వ: పదోతరగతి విద్యార్థులకు అల్పాహారం అందించిన దాతల సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం పాథర్చేడ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదవాలని అప్పుడే తల్లిదండ్రులు, గురువుల కన్న కలలు నిజమవుతాయన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పదోతరగతి విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడేలా ఇటీవల త్రీడీ, టూడీ బుక్‌లెట్స్‌ను తన సొంత ఖర్చులతో అందించానన్నారు. విద్యార్థులు ఉన్న అతి తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోని లక్ష్యాన్ని చేదించాలన్నారు. కార్యక్రమంలో దాత లంకాల్ కుర్వ మహేష్, హెచ్‌ఎం కృష్ణయ్య, నాయకులు మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నయ్యసాగర్, శ్రీనివాస్‌రెడ్డి, వివేకవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు అండగా..
ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం నర్వ రైతువేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన నాయకులతో కలిసి పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment