![ఫిర్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mkl801-210168_mr-1739221389-0.jpg.webp?itok=EbrVTME6)
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట టౌన్: ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని.. నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాతాల నుంచి ప్రజలు తమ వినతులు కలెక్టర్‌తోపాటు ఆర్డీఓ రాంచందర్‌కు అందజేశారు.
37 మందికి హెచ్‌సీలుగా పదోన్నతి
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేస్తున్న 37 మంది కానిస్టేబుల్స్‌కు హెడ్‌కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ సోమవారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 22 మందికి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఐదుగురికి, వనపర్తిలో ఆరుగురికి, గద్వాలలో ముగ్గురికి, నారాయణపేట జిల్లాలో ఒకరికి హెడ్‌కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పించారు. వీరిలో మహబూబ్‌నగర్‌లో ఒకరికి, నాగర్‌కర్నూల్ జిల్లాలో 13 మందికి, వనపర్తిలో ఆరుగురికి, గద్వాలలో ఆరుగురు, నారాయణపేట జిల్లాలో 9 మందికి, ఇంటలిజెన్స్‌లో ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చారు. పదోన్నతి వచ్చిన హెడ్‌కానిస్టేబుల్స్ రెండు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.
విగ్రహ ప్రతిష్ఠాపనకు సీఎంకు ఆహ్వానం
కొత్తపల్లి: మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని కొత్తపల్లి కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో నాయకులు చెన్నప్ప, చిన్నమల్లప్ప, బాలకిష్టయ్య, అల్లీ తిరుమలయ్య, బిచ్చాల వెంకటయ్య, జనార్ధన్ తదితరులు కలిశారు. గ్రామస్తులు, యాదవుల సహకారంతో నిర్మించిన అలయంలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో విగ్రహా ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎంకు తెలిపారు.
మన్యంకొండ జాతరకు ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్‌నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 12, 13 తేదీల్లో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపనున్నట్లు రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టి లో పెట్టుకొని మహబూబ్‌నగర్, నారాయణ పేట డిపోల నుంచి 20 ప్రత్యేక బస్సుల చొప్పు న దాదాపు 150 అదనపు ట్రిప్పులను మన్యంకొండ జాతరకు నడుపుతామని పేర్కొన్నారు. కొండ మీదకు ప్రత్యేకంగా 20 మినీ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగునీటి, నీడ కోసం ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశామని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
![ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10nrpt503-210159_mr-1739221389-1.jpg)
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
Comments
Please login to add a commentAdd a comment